నానబెట్టిన మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
నానబెట్టిన మెంతులు క్రమం తప్పకుండా తినడం వల్ల ఏళ్లుగా బాధిస్తోన్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. టీ స్పూను మెంతులను గ్లాసునీళ్లలో రాత్రి పూట నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి. మెంతులు నానబెట్టిన నీటిని కూడా తాగాలి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.