చుక్కకూర ఉపయోగాలివే!!

 

చుక్కకూరనే పుల్లబచ్చలి అని కూడా పిలుస్తారు దీనిలో 2 రకాల జాతులు కలవు. అవి చుక్కకూర , చిన్న చుక్కకూర . అందరికీ తెలుసిందే, అందరికీ అందుబాటులో దొరికే ఆకుకూర. చాలా తేలిగ్గా జీర్ణమై శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నోటికి పుల్లగా వుండి మంచి రుచిని కలిగిస్తుంది. దీన్ని పప్పు కలిపి వండుకోవచ్చు. పులుసుగాను, పచ్చడిగాను, కూరగాను, ఇంకా అనేక రకాలుగాను ఈ ఆకును ఉపయోగిస్తారు. ఇతర కూరలతో కలిపి కూడా వండుకోవచ్చు. పైత్య తత్వం గలవారికి పైత్యరోగాలలో ఈ కూర తినడం వల్ల మేలు చేస్తుంది.

చుక్క కూర ఆకులు రసం ఒక ఔన్సు తీసి పెరుగులో కాని, పాలతో కాని కలిపి తాగితే మూడు రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అనేక రకాల చర్మవ్యాధులు తగ్గిస్తుంది. త్వరగా జీర్ణంకాని దుంపకూరలు, పప్పు దినుసులతో ఈ ఆకు కలిపి వండితే త్వరగా జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. ఔన్సు చుక్క కూర ఆకు రసంలో చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపునొప్పులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. గ్రహిణి, అతిసార వ్యాధుల్లో చుక్కకూర పథ్యమివ్వడం వల్ల సులభంగా తగ్గుతాయి.

చుక్కకూర  ఉపయోగాలివే!!


చుక్కకూర ఉపయోగాలివే!!

  • జీర్ణశక్తిని పెంచుతుంది
  • శూల ను హరించును
  • చెవి పోటును నీ తగ్గించును
  • హృదయ వేదనను తగ్గించును
  • కామెర్ల వ్యాధి తగ్గుతుంది
  • ముక్కు వెంట రక్తము కారుటను నీ తగ్గించును
  • కడుపు నొప్పి నీ తగ్గించును
  • శరీరం లోని చెడు నీరు ను కరిగించును
  • వాంతుల ను ,దాహమును అణచును.
  • మలబద్దకం ని తొలగించి సుఖవిరేచనం కలిగించును
  • మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చూస్తుంది
  • వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేయును
  • జీర్ణకోశంలో ఏర్పడే మంటని , వేడిని ఇది తగ్గించును
  • శరీరం నందు ఉత్సాహాన్ని కలిగిస్తుంది
  • వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిచేయును
  • చుక్క ఆకు మాంసం లో వేసి వండరాదు
  • చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అగును