- మామిడిపండు అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది.
- సన్నగా ఉన్నవారు, బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి.
- మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి మామిడి చాలా మేలు చేస్తుంది.
- మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి మామిడి చాలా మేలు చేస్తుంది
- ఈ పండులోని విటమిన్ ఏ తోపాటు లభించే కెరోటిన్.. దృష్టి నష్టాన్ని నివారించి.. కంటిశుక్లం వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- వడదెబ్బను నివారిస్తుంది వేసవి లో భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం కోసం ఈ పండు చాలా చక్కగా పనిచేస్తోంది.
- మామిడి పండ్లను తినడంవల్ల ఎముకలు విరగడాన్ని నివారించుకోవడమే కాకుండా ఎముక బలాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
- ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండి వీటిని తినడం వలన రక్తహీనత సమస్య నుంచి మంచి ఫలితాన్ని పొందవచ్చు.
- మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి.
- ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించే సామర్ధ్యం వీటికి ఉన్నదని పరిశోధనలో తేలింది.
- మామిడి పండు తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
మామిడి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:
- మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి మన శరీరానికి ఉపయోగపడతాయి.
- చక్కెరవ్యాధి (మధుమేహం) నియంత్రించడంలో మామిడి ఆకుల మిశ్రమం చక్కటి పాత్రని పోషిస్తాయి.
- మామిడి ఆకులు, నీటి మిశ్రమం హైబీపీని తగ్గిస్తుంది. రోజుకు 2 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితం లభిస్తుంది.
- మామిడి ఆకుల్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- విరేచనాల సమస్యతో బాధపడేవారు మామిడి ఆకుల నీటి మిశ్రమాన్ని తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
- దగ్గు సమస్య ఉన్నవారికి మామిడాకులు ఎంతో మేలు చేస్తాయి.
- మామిడి ఆకులు కాల్చడం వలన వాటి నుంచి వెలువడే పొగ పీల్చడం ద్వారా వెక్కిళ్ల ను తగ్గించవచ్చు.
మామిడి ఆకుల మిశ్రమం(టీ) తయారు చేయు విధానం.
ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో నీరు రంగు మారుతుంది. తరువాత స్టవ్ ఆర్పి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం దాన్ని వడకట్టి తాగాలి. ఇలా మామిడి ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.
మామిడి పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు(అప్రయోజనాలు):
- కొందరు వ్యక్తులు మామిడిపండ్లను తింటే అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది.
- మామిడిపండ్లను దండిగా తింటే గనుక కడుపులో ప్రతికూల ప్రభావాన్ని కలిగించ వచ్చు మరియు అది అతిసారానికి దారి తీయవచ్చు .
- చాలా దండిగా మామిడిపండ్లను తినడంవల్ల బరువు పెరగవచ్చు.
- మామిడి పండ్లు తినడంవల్ల ఇప్పటికే చక్కెరవ్యాధితో (మధుమేహంతో) బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
- కృత్రిమంగా మాగిన మామిడిపండ్లను తినడంవల్ల క్యాన్సర్, కడుపులో నోప్పి & వివిధ ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
