పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు తెలుసుకుందాం.

  పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు తెలుసుకుందాం.

  • పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది. శరీరానికి చలువను ఇస్తుంది. 
  • పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ, ప్రోటీన్‌ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్‌ అసలు ఉండదు.
  • పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ.
  • పుచ్చకాయలో అధిక క్యాలరీలు కూడా ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్.
  • వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబర్చుకోవడానికి పుచ్చకాయలు ఉపయోగపడతాయి.


పుచ్చకాయ గింజలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది. ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.
  • మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ గింజలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • పుచ్చకాయ గింజలను ఆహారం తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
  • పుచ్చ గింజలను నిత్యం తింటుంటే నేత్ర స‌మ‌స్య‌లు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
  • ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.
  • హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ గింజలను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది. 

 పుచ్చకాయ తినడం వల్ల కలిగే అప్రయోజనాలు తెలుసుకుందాం.

  • డయాబెటిస్ రోగులు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి లేదా శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
  •  ఒక రోజులో 400-500 గ్రాముల పుచ్చకాయను తీసుకుంటే సరిపోతుంది. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. 
  • అలాగే లూస్ మోషన్, గ్యాస్, అపానవాయువు, విరేచనాలు వంటి సమస్యలు ఉండవచ్చు.
  • రాత్రికి పుచ్చకాయ తింటే బరువును పెంచుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.