ఎండాకాలంలో రాగి అంబలి ప్రయోజనాలు.
- ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా రాగి అంబలి తాగితే శరీర దృఢత్వం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
- ఇది చలువచేస్తుంది. అలసటను పోగొడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి రాగి అంబలి మంచి బలాన్ని ఇస్తుంది.
- రాగి అంబలి పిల్లలకు మంచిది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- అన్నం తినాలనే కాంక్షను తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు.
- శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నవారు రాగి అంబలి తాగితే నియంత్రణలోకి వస్తాయి.
- రక్త స్రావంతో ఇబ్బంది పడుతున్నవారు తాగితే రక్తం గడ్డకట్టుకుంటుంది. రక్త స్రావం ఆగిపోతుంది.
- నీరసంతో క్షీణించినవారికి, అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా ఉపయోగకరం.
- ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. స్థూలకాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు.
- రాగి అంబలిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. శారీరక దృఢత్వం చేకూరుతుంది.