చేపలతో కీళ్ళ నొప్పులకు చెక్:
వారానికి 2సార్లు ఆహారంలో చేపలను చేర్చుకుంటే
కీళ్ళ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుందని
వైద్యులు తెలిపారు. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా చేపలను
తింటే ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభించి
నొప్పుల నుంచి త్వరగా బయటపడేస్తాయన్నారు. చేపలను
తినలేని వారు రోజూ గుప్పెడు అవిసెగింజలు లేదా
బాదం, వాల్‌నట్స్, పొద్దు తిరుగుడు గింజలు, విటమిన్
సీ ఉండే పండ్లు తిన్నా కీళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుందని
వివరించారు.
