
అల్యూమినియం పాత్రల వాడకం తగ్గించండి
అల్యూమినియం పాత్రలను అధికంగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. తుక్కుతో తయారైన వీటి నుంచి వెలువడే సీసం, కాడ్మియం వంటి వివిధ మూలకాల వల్ల గుండెజబ్బులకు దారితీయడంతో పాటు పిల్లల తెలివితేటలను గణనీయంగా దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. అటు మట్టి పాత్రలను వాడటం వల్ల ఈ దుష్పరిమాణాలకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.