తమలపాకుతో సౌందర్యం:
- తమలపాకులను మెత్తగా చేసిన తర్వాత అందులో చిటికెడు పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం మృదువుగా మారుతుంది.
- నువ్వుల నూనెలో తమలపాకులు వేసి మరిగించిన తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది.
