బొప్పాయి ఆకులతోనూ ఆరోగ్యం:
బొప్పాయి పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆకులతో చేసిన జ్యూసు తాగడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని, చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు విష జ్వరాలు రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఇంకా జుట్టు కూడా పెరగడంతో పాటు ధృఢంగా మారుతుందట.
