నిమ్మరసం, పసుపు కలిపి తీసుకుంటే ఫలితాలు అద్భు తం..
నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమం సేవిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. చర్మ సమస్యలు తగ్గి, ఈ సీజన్‌లో చర్మం పగలకుండా ఉంటుంది.
- అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది
- క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది
- కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
- యువెటిస్ చికిత్సకు సహాయపడుతుంది
