ఉసిరి.. ఆరోగ్యానికి గొప్ప సిరి!
ఉసిరి పండును అమృత ఫలము అని అంటారు. ఇందులోవిటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని ఇది తుంది. వీటి తో పాటు అజీర్తి, రక్తహీనత, కామెర్లు, గుండె జబ్బులకు ఈ పండ్లతో తయారుచేసిన మందులు జౌషధంగా పనిచేస్తాయి. డయేరియా, రక్తవిరోచన వ్యాధుల నివారణకు వీటిని ఎక్కువ ఉపయోగిస్తారు. క్షయ రోగులకు ఉసిరి పండులోని విటమిన్ సి బాగా పనిచేస్తుంది. ఈ వేసవిలో అధికంగా లభించే ఉసిరిని మిస్ కాకండి.
