ఎముకల అరుగుదల యొక్క చికిత్స మరియు నివారణ..

 


ఎముకల అరుగుదల యొక్క చికిత్స మరియు నివారణ..

1. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. 2. రోజువారీ మితమైన కాల్షియం మరియు విటమిన్‌-డి తీసుకోవడం. 3. హార్మోన్‌ పునఃస్థాపన చికిత్స. 4.ఎముక పగుళ్లకు సంప్రదాయవాద లేదా శస్తచికిత్స అవసరం. 5.నొప్పిని నయం చేయడానికి అనాల్టెసిక్‌ మందులు తీసుకోవాలి.

నానబెట్టిన మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

 నానబెట్టిన మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

నానబెట్టిన మెంతులు క్రమం తప్పకుండా తినడం వల్ల ఏళ్లుగా బాధిస్తోన్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. టీ స్పూను మెంతులను గ్లాసునీళ్లలో రాత్రి పూట నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి. మెంతులు నానబెట్టిన నీటిని కూడా తాగాలి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.



ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు



ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు... ఈ చిట్కాలు మీ ఆరోగ్యానికి మరింత సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. అందరికి ఉపయోగపడే వీడియో తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి. మా ఛానెల్‌ను Subscribe చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.



మామిడి పండ్ల & మామిడి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు.


మామిడి పండ్లను తినడం 
వల్ల కలిగే ప్రయోజనాలు:

  • మామిడిపండు అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది.
  • సన్నగా ఉన్నవారు, బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి.  
  • మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి మామిడి చాలా మేలు చేస్తుంది.
  • మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి మామిడి చాలా మేలు చేస్తుంది
  • ఈ పండులోని విటమిన్ ఏ తోపాటు లభించే కెరోటిన్.. దృష్టి నష్టాన్ని నివారించి.. కంటిశుక్లం వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • వ‌డ‌దెబ్బను నివారిస్తుంది వేస‌వి లో భానుడి ప్ర‌తాపం నుంచి ఉప‌శ‌మ‌నం కోసం ఈ పండు చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తోంది.
  • మామిడి పండ్లను తినడంవల్ల ఎముకలు విరగడాన్ని నివారించుకోవడమే కాకుండా ఎముక బలాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
  • ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండి వీటిని తినడం వలన రక్తహీనత సమస్య నుంచి మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  •  మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి.
  • ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించే సామర్ధ్యం వీటికి ఉన్నదని పరిశోధనలో తేలింది.
  • మామిడి పండు తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మామిడి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:

  • మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 
  • చక్కెరవ్యాధి (మధుమేహం) నియంత్రించడంలో మామిడి ఆకుల మిశ్ర‌మం చ‌క్క‌టి పాత్ర‌ని పోషిస్తాయి.
  • మామిడి ఆకులు, నీటి మిశ్ర‌మం హైబీపీని త‌గ్గిస్తుంది. రోజుకు 2 సార్లు ఈ మిశ్ర‌మాన్ని తాగితే  మంచి ఫలితం లభిస్తుంది.
  • మామిడి ఆకుల్లోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి.  దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.  
  • విరేచ‌నాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు మామిడి ఆకుల‌ నీటి  మిశ్ర‌మాన్ని  తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • దగ్గు సమస్య ఉన్నవారికి మామిడాకులు ఎంతో మేలు చేస్తాయి.
  • మామిడి ఆకులు కాల్చడం వలన వాటి నుంచి వెలువడే పొగ పీల్చడం ద్వారా వెక్కిళ్ల ను తగ్గించవచ్చు.

మామిడి ఆకుల మిశ్ర‌మం(టీ) తయారు చేయు విధానం.

ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. త‌రువాత ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో నీరు రంగు మారుతుంది. త‌రువాత స్ట‌వ్ ఆర్పి ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నివ్వాలి. అనంత‌రం దాన్ని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా మామిడి ఆకుల‌తో త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి.

మామిడి పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు(అప్రయోజనాలు):

  • కొందరు వ్యక్తులు మామిడిపండ్లను తింటే అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. 
  • మామిడిపండ్లను దండిగా తింటే గనుక కడుపులో ప్రతికూల ప్రభావాన్ని కలిగించ వచ్చు మరియు అది అతిసారానికి దారి తీయవచ్చు . 
  • చాలా దండిగా మామిడిపండ్లను తినడంవల్ల బరువు పెరగవచ్చు. 
  • మామిడి పండ్లు తినడంవల్ల ఇప్పటికే చక్కెరవ్యాధితో (మధుమేహంతో) బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
  • కృత్రిమంగా మాగిన మామిడిపండ్లను తినడంవల్ల క్యాన్సర్, కడుపులో నోప్పి & వివిధ ఇతర వ్యాధులకు దారితీస్తుంది.



పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు తెలుసుకుందాం.

  పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు తెలుసుకుందాం.

  • పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది. శరీరానికి చలువను ఇస్తుంది. 
  • పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ, ప్రోటీన్‌ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్‌ అసలు ఉండదు.
  • పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ.
  • పుచ్చకాయలో అధిక క్యాలరీలు కూడా ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్.
  • వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబర్చుకోవడానికి పుచ్చకాయలు ఉపయోగపడతాయి.


పుచ్చకాయ గింజలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది. ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.
  • మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ గింజలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • పుచ్చకాయ గింజలను ఆహారం తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
  • పుచ్చ గింజలను నిత్యం తింటుంటే నేత్ర స‌మ‌స్య‌లు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
  • ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.
  • హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ గింజలను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది. 

 పుచ్చకాయ తినడం వల్ల కలిగే అప్రయోజనాలు తెలుసుకుందాం.

  • డయాబెటిస్ రోగులు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి లేదా శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
  •  ఒక రోజులో 400-500 గ్రాముల పుచ్చకాయను తీసుకుంటే సరిపోతుంది. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. 
  • అలాగే లూస్ మోషన్, గ్యాస్, అపానవాయువు, విరేచనాలు వంటి సమస్యలు ఉండవచ్చు.
  • రాత్రికి పుచ్చకాయ తింటే బరువును పెంచుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

ఎండాకాలంలో రాగి అంబలి ప్రయోజనాలు..

 


ఎండాకాలంలో రాగి అంబలి ప్రయోజనాలు.

  • ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా రాగి అంబలి తాగితే శరీర దృఢత్వం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. 
  • ఇది చలువచేస్తుంది. అలసటను పోగొడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి రాగి అంబలి మంచి బలాన్ని ఇస్తుంది.
  • రాగి అంబలి పిల్లలకు మంచిది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • అన్నం తినాలనే కాంక్షను తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు. 
  • శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. రక్తపోటు, షుగర్‌ వ్యాధి ఉన్నవారు రాగి అంబలి తాగితే నియంత్రణలోకి వస్తాయి. 
  • రక్త స్రావంతో ఇబ్బంది పడుతున్నవారు తాగితే రక్తం గడ్డకట్టుకుంటుంది. రక్త స్రావం ఆగిపోతుంది.
  • నీరసంతో క్షీణించినవారికి, అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా ఉపయోగకరం. 
  • ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.
  • రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. శారీర‌క దృఢ‌త్వం చేకూరుతుంది.



వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల ప్రయోజనాలు:


వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల ప్రయోజనాలను తెలుసుకోండి. ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టవచ్చు

  • మునక్కాయ(Drumstick): ఇవి ఆకలిని పెంచుతాయి
  • బొప్పాయి(Papaya): ఇవి మొలల వ్యాధికి మంచి మందు
  • జామ పళ్ళు(Guavas):  విటిని ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి
  • సపోటా(Sapodilla): ఇవి పళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి
  • అల్లం(Ginger): కొంచెం తింటే ఎక్కిళ్ళు తగ్గిస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది మరియు మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
  • కారెట్(Carrot): ఇవి నరాల బలహీనత నుండి కాపాడతాయి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
  • మొక్కజొన్న(Corn): మూత్రపిండాల వ్యాధులున్న వారికి మంచి బెషదం
  • దాల్చిన చెక్క(Cinnamon): పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది
  • కరివేపాకు(Curry Leaves): ఇవి రక్తహీనతను తగ్గిస్తుంది
  • బీట్‌రూట్(Beetroot): ఇవి బీపీని క్రమబద్దీకరిస్తాయి
  • సజ్జలు(Pearl Millet): విటిని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్‌ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది
  • దానిమ్మ(Pomegranate): దిని రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది
  • ఉల్లిపాయ(Onion): విటిని తింటే శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది
  • గుమ్మడికాయ(Pumpkin): ఇవి మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
  • యాపిల్‌ (Apple): విటిని తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది
  • మామిడిపండ్ల(Mango): విటిలో మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది 
ఈ చిట్కాలు మీ ఆరోగ్యానికి మరింత సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. అందరికి ఉపయోగపడే వీడియో తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి. మా ఛానెల్‌ను Subscribe చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

చలికాలం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

 

చలికాలం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేసుకోవడం అస్సలు మరవొద్దు.
  • విటమిన్‌ ౦ ఎక్కువుండే పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి.
  • దుస్తులు తడిగా ఉన్నట్లయితే వెంటనే మార్చుకొని శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూస్కోండి.
  • ఆహారం, తాగునీరు ద్వారా అనేక ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తలు కంపల్సరీ.
  • పొగమంచులో కాలుష్య కారకాలు ఎక్కువ ఉంటాయి. బయటకెళ్తే స్వెట్టర్‌, మాస్క్‌, సాక్స్‌ వేసుకోండి.
  • పిల్లలకు కాచి చల్లార్చిన నీరు, వేడి వేడి ఆహారంఅందించాలి.

కొబ్బరినీళ్లతో ప్రయోజనాలు

 

కొబ్బరినీళ్లతో ప్రయోజనాలు

కొబ్బరినీళ్లతో ప్రయోజనాలు:

  • జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది 
  • అధిక బరువు తగ్గుతారు
  • శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది
  • చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
  • మానసిక ఒతిడిని తగ్గిస్తుంది 
  • వృద్లాప్సం రాకుండా కాపాడుతుంది 
  • శరీరానికి అధిక తేమను అందిస్తుంది

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు

 

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు:

  • చర్మ వ్యాధులను తగ్గిస్తుంది
  • రక్తపోటును అదుపులో ఉంచుతుంది
  • గుండెను సంరక్షిస్తుంది
  • అలర్జీలతో పోరాడుతుంది
  • జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది
  • నోటి వ్యాధులను తగ్గిస్తుంది
  • బరువు తగ్గడంలో సాయపడుతుంది
  • వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది
  • శ్వాసకోశ సమస్యలకు మంచి పరిష్కారం
  • ఇస్తుంది


పచ్చికొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు...

పచ్చికొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు...

పచ్చికొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు...

  • రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
  • అలసట దరిచేరదు
  • జీర్ధాశయ సమస్యలు దూరమవుతాయి
  • మధుమేహం అదుపులో ఉంటుంది
  • క్యాన్సర్‌ కణతుల వృద్ధి ఆగిపోతుంది
  • చర్మంపై వచ్చే ముడతలు పోతాయి
  • గుండె సంబంధ సమస్యలు తగ్గిపోతాయి
  • థైరాయిడ్‌ సమస్వలు తగ్గుముఖం పడతాయి


 

చల్లని నీళ్లను అధికంగా తాగితే..?

చల్లని నీళ్లను అధికంగా తాగితే..?

చల్లని నీళ్లను అధికంగా తాగితే..?

నీరు చల్లగా ఉంటేనే ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతారు. అయితే చల్లగా ఉన్న నీరు తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యలు హెచ్చరిస్తున్నారు. కూల్‌ వాటర్‌ను తాగడం వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోతాయి. జీర్ణాశయం కుచించుకుపోవడం వల్ల జీర్ణ శక్తి తగ్గుతుంది. డీహైడ్రేషన్‌ త్వరగా వస్తుంది. ఇక తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగడం వల్ల కొవ్వులు గడ్డకట్టుకుపోవడంతో జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయని సూచిస్తున్నారు.


 

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు:

  • కంటిచూపును మెరుగుపరుస్తుంది 
  • ఎముకలను దృఢపరుస్తుంది  
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది  
  • రోజూ పాలు తాగితే అందం పెరుగుతుంది  
  • వ్యాయమం తరువాత పాలు తాగితే కండరాలకు ఎంతో మంచిది మెదడుకు శక్తినిస్తుంది  
  • క్యాన్సర్‌, డయాబెటీస్‌, ఒబెసిటీపై పోరాడుతుంది  
  • రోగాల నుంచి కోలుకోవటంలో సహకరిస్తుంది 
  • శరీరం హైడ్రేట్‌ కాకుండా చేస్తుంది 
  • ఎసిడిటీ తగ్గిస్తుంది  
  • పాలల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి 


 

అంజీరతో ఆరోగ్యం

"అంజీర" తో ఆరోగ్యం

అంజీరతో ఆరోగ్యం:

  • రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
  • ఫైల్స్‌ బాధపడేవారు 2 లేదా ౩ అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
  • రోజు ఉదయం రెండు అంజీర పండ్లను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది.
  • గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
  • నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత ౩ పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
  • హైబీపీ, దయాబెటిసను అదుపులో ఉంచుతుంది.



 

మసాలా ఛాయ్‌ ఆరోగ్య ప్రయోజనాలు

మసాలా ఛాయ్‌ ఆరోగ్య ప్రయోజనాలు

మసాలా ఛాయ్‌ ఆరోగ్య ప్రయోజనాలు:

  • జలుబు, ముక్కు సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది.
  • జీర్ణక్రియకు తోడ్చడుతుంది.
  • జీవక్రియను మెరుగుపరుస్తుంది.
  • ఉబ్బరాన్ని నివారిస్తుంది.
  • శక్తినిస్తుంది.
  • బీపీని నియంత్రిస్తుంది.
  • వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
  • క్యాన్సర్‌ ని నిరోధిస్తుంది.


 

కాకరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

కాకరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

కాకరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • లివర్‌ సమస్యలు నయం అవుతాయి
  • మూత్రపిండాల్లోని రాళ్లు నివారించడంలో సాయపడతాయి
  • గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
  • బరువు తగ్గడానికి సహాయపడతాయి
  • డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి
  • మలబద్దకం, అజీర్తి సమస్ట లను నివారిస్తాయి
  • శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో సాయం చేస్తాయి
  • మొటిమలు, మచ్చలు, చర్మ అంటువ్యాధులను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి



 

తమలపాకుతో సౌందర్యం

తమలపాకుతో సౌందర్యం

తమలపాకుతో సౌందర్యం:

  • తమలపాకులను మెత్తగా చేసిన తర్వాత అందులో చిటికెడు పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం మృదువుగా మారుతుంది.
  • నువ్వుల నూనెలో తమలపాకులు వేసి మరిగించిన తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది.


 

బొప్పాయి ఆకులతోనూ ఆరోగ్యం

బొప్పాయి ఆకులతోనూ ఆరోగ్యం

బొప్పాయి ఆకులతోనూ ఆరోగ్యం:

బొప్పాయి పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆకులతో చేసిన జ్యూసు తాగడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని, చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు విష జ్వరాలు రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఇంకా జుట్టు కూడా పెరగడంతో పాటు ధృఢంగా మారుతుందట.


 

తోటకూర తినడం వల్ల లాభాలు

తోటకూర తినడం వల్ల లాభాలు

తోటకూర తినడం వల్ల లాభాలు:

  • తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి
  • విటమిన్‌ గ A, C, D, E, K, B12, B6 వంటివి తోటకూరలో ఉంటాయి
  • తోటకూర కొవ్వును తగ్గిస్తుంది
  • తోటకూరలో ఉండే పీచుపదార్థం జీర్లశక్తిని పెంచుతుంది
  • సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది


 

నిమ్మరసం, పసుపు కలిపి తీసుకుంటే ఫలితాలు అద్భుతం..

నిమ్మరసం, పసుపు కలిపి తీసుకుంటే ఫలితాలు అద్భు తం..

నిమ్మరసం, పసుపు కలిపి తీసుకుంటే ఫలితాలు అద్భు తం..

నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమం సేవిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. చర్మ సమస్యలు తగ్గి, ఈ సీజన్‌లో చర్మం పగలకుండా ఉంటుంది.
  • అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది
  • క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
  • యువెటిస్ చికిత్సకు సహాయపడుతుంది